విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం: ఆదిమూలపు సురేష్
Sakshi Education
ఇబ్రహీంపట్నం(మైలవరం) : సమాజానికి అవసరమైన విధంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ(ఎస్‌సీఈఆర్టీ) ఆధ్వర్యంలో డిసెంబర్ 31వ తేదీన ఏర్పాటు చేసిన జాతీయ గణిత దినోత్సవ వారోత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గణిత, సామాన్యశాస్త్ర ప్రత్యేక ప్రయోగశాలలు, లైబ్రరీని ఆయన ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర స్థాయి మోడల్ సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం ట్రిపుల్ ఐటీలో 99 మార్కులు సాధించిన ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి వంశీకృష్ణను మెమెంటో, సర్టిఫికెట్‌తో అభినందించారు. రాష్ట్రస్థాయి మోడల్ సైన్స్ ల్యాబ్‌లో ఆవిష్కరణలు రూపొందించిన విద్యార్థులకు మెమెంటోలు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.
Published date : 01 Jan 2021 04:35PM