విఐటి-ఎపి విశ్వవిద్యాలయం మరియు IDS Inc. USA మధ్య అవగాహనా ఒప్పందం
Sakshi Education
అమరావతి: స్కూల్ ఆఫ్ కంప్యూటర్ ఆఫ్ ఇంజనీరింగ్ (స్కోప్), విఐటి-ఎపి విశ్వవిద్యాలయం మరియు ఐడిఎస్ ఇంక్. మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయు) సంతకం కార్యక్రమం 2021 జూన్ 2 బుధవారం నాడు వర్చ్యువల్ విధానంలో జరిగింది. ఈ అవగాహనా ఒప్పందం ద్వారా విద్యార్థులు బ్లాక్ చైన్ టెక్నాలజీ లో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం, పరిశోధనలు చేయటానికి ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది.
ఐడిఎస్ ఇంక్ యుఎస్ఎతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత విఐటి-ఎపి విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ డా|| ఎస్ వి కోటా రెడ్డి మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం బ్లాక్ చైన్ టెక్నాలజీలో విద్యార్థులకు నైపుణ్యాలను మేరుగుపరుచుకోవటానికి మరియు వృత్తిరిత్యా అభివృద్ధి చెందేందుకు వీలు కల్పింస్తుందని తెలియచేసారు. విద్యార్థులు, మరియు అధ్యాపకులు బ్లాక్చైన్ టెక్నాలజీని ఉపయోగించి పరిశోధన రంగంలో అనేక అధునాతన అనువర్తనాలను ఆవిష్కరించటానికి కూడా అవకాశాన్ని కల్పిస్తుంది. ఇంకా, ఐడిఎస్ ఆర్థిక సహాయంతో విఐటి-ఎపి విశ్వవిద్యాలయంలోని ఎంపిక చేసిన విద్యార్థులకు ఇంటర్న్షిప్లు మరియు ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది.
ఐడిఎస్ ఇంక్ యుఎస్ఎ సిఇఒ సుదర్శన్ రెడ్డి మినుముల మాట్లాడుతూ విఐటి-ఎపి విశ్వవిద్యాలయంతో ఈ సహకారం అధ్యాపకులకు మరియు విద్యార్థులకు భవిష్యత్ తరం సాంకేతిక పరిజ్ఞానాలకు తగ్గట్టు పని చేయడానికి సహాయపడుతుందని తెలియచేసారు. బ్లాక్చెయిన్ టెక్నాలజీలో వృత్తిపరంగా ఎదగటానికి విద్యార్థులను ప్రోత్సహిస్తుందని, ఐడిఎస్, హైపర్ లెడ్జర్ ట్రైనింగ్ పార్ట్నర్గా అకాడెమియా నుండి పరిశ్రమకు నాణ్యమైన టాలెంట్ పైప్లైన్ను సృష్టిస్తోందని, కొత్త ఆవిష్కరణలకు / ఆలోచనలకు ఆర్థిక పరంగా విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి ఐడిఎస్ ఆసక్తి చూపుతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ హరి సీత, డీన్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, విఐటి-ఎపి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా|| సి.ఎల్.వి.శివకుమార్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Published date : 03 Jun 2021 01:38PM