వైరల్ అవుతున్న ఈ వార్త పూర్తిగా అవాస్తవం...: ఆదిమూలపు సురేష్
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్ : గత కొన్ని రోజులుగా పాఠశాలలకు సెలవులంటూ సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 26వ తేదీన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ సాకు చూపి మార్చి 1వ తేదీ నుంచి పాఠశాలలకు సెలవులంటూ వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదన్నారు. అది పూర్తిగా అవాస్తవం.. దాన్ని ఎవరూ వైరల్ చేయద్దన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.సైబర్ క్రైమ్‌లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. యధావిధిగా పాఠశాలలు నడుస్తాయని, అందులో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. జూనియర్ కళాశాలలు కూడా షెడ్యూల్ ప్రకారం నడుస్తాయని వెల్లడించారు.
Published date : 26 Feb 2021 05:52PM