Skip to main content

వైద్య కాలేజీల్లో రుసుములపై టీఎస్ హైకోర్టు తీర్పు నిలిపివేత

సాక్షి, న్యూఢిల్లీ: వైద్య కాలేజీల్లో విద్యార్థుల నుంచి రుసుములు నాలుగున్నరేళ్లదే వసూలు చేయాలని, తదుపరి ఆరు నెలల కాలానికి వసూలు చేయరాదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది.
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రైవేట్ వైద్య, దంత కాలేజీల యాజమాన్య సంఘం తరపున రమేశ్ అల్లంకి అండ్ అసోసియేట్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. పిటిషనర్ తరపున న్యాయవాదులు ఆర్.వెంకటరమణి, రమేశ్‌లు వాదనలు వినిపించారు. ‘వైద్య విద్య కోర్సు నాలుగున్నరేళ్లే అయినప్పటికీ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆ నాలుగున్నరేళ్ల రుసు మునే ఐదేళ్లకు సర్దుబాటు చేసి వైద్య విద్యాసం స్థలు వసూలు చేస్తాయి. అది కూడా అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ ఖరారు చేసిన ఫీజులనే వసూలు చేసా ్తయి. కానీ 2018లో వైద్య విద్యలో ప్రవే శాన్ని ఆకాంక్షించిన విద్యార్థి ని దాఖ లు చేసిన కేసులో ఎంసీఐని గానీ, ఫీజుల నియంత్రణ కమిటీని గానీ, కాలేజీల యాజమాన్యాలను గానీ ప్రతివాదులను చేయలేదు. హైకోర్టు కూ డా ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశించలేదు. ప్రతివాదులు లేకుండానే హైకోర్టు.. ప్రభుత్వ జీవోను రద్దు చేస్తూ ఫీజును నాలుగున్నరేళ్లకే వసూలు చేయాలంటూ జనవరి 10న ఆదేశించింది. అంటే ఒక ఏడాది ఫీజులో సగం ఫీజును తగ్గించింది. అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ ఫీజు నిర్ధారించిన తర్వాత ఫీజుల నిర్ధారణలో కోర్టులు జోక్యం చేసుకోజాలవని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది’అని వాదనలు వినిపించారు. ఈనేపథ్యంలో ధర్మాసనం తెలంగాణ సర్కారుకు, కాళోజీ నారాయణ రావు హెల్త్ వర్సిటీకి, హైకోర్టులో పిటిషనర్ అయిన విద్యార్థినికి నోటీసులు జారీచేసింది. జీవోను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది.
Published date : 01 Feb 2020 04:18PM

Photo Stories