ఉర్దూ వర్సిటీలో 2021 ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు
Sakshi Education
రాయదుర్గం(హైదరాబాద్): హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం 2021–22 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతోంది.
ప్రధాన క్యాంపస్‌తోపాటు లక్నో, శ్రీనగర్‌లలోని శాటిలైట్ క్యాంపస్‌లు, ఉపాధ్యాయ విద్యా కళాశాలలు(సీటీఈ), పాలిటెక్నిక్ కళాశాలల్లో ఆన్‌లైన్‌లో ప్రవేశ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు యూనివర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సిద్ధీఖీ మహ్మద్ మహమూద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ద్వారా కోర్సుల్లో చేరేందుకు జూలై 12లోగా, మెరిట్ ఆధారంగా ప్రవేశం పొందేందుకు సెప్టెంబర్ 4లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పార్ట్‌టైమ్ ప్రోగ్రాముల్లో దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 15. మదర్సా పాస్‌అవుట్‌లు బీకామ్, బీఎస్సీల్లో చేరేందుకు వీలుగా వర్సిటీ బ్రిడ్జి కోర్సులను కూడా అందిస్తోంది. వివరాలకు https://manuu.edu.in వెబ్‌సైట్ లేదా 9523558551, 9866802414, 6302738370, 9849847434 నంబర్లలో సంప్రదించొచ్చు.
చదవండి: రెండేళ్లలోనే ఏపీలో విద్య, వైద్య విప్లవం
చదవండి: జూన్16 నుంచి ఇంటర్మీడియట్ ఆన్‌లైన్ తరగతులు!
చదవండి: ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ భారీగా పెరిగింది
చదవండి: రెండేళ్లలోనే ఏపీలో విద్య, వైద్య విప్లవం
చదవండి: జూన్16 నుంచి ఇంటర్మీడియట్ ఆన్‌లైన్ తరగతులు!
చదవండి: ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ భారీగా పెరిగింది
Published date : 14 Jun 2021 07:07PM