ట్రిపుల్ ఐటీలో బాలికలకు 25% ఫీజు రాయితీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ లో మంచి ర్యాంకు సాధించిన బాలికలకు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ 25 శాతం ఫీజు రాయితీ కల్పించేలా చర్యలు చేపట్టింది.
ఈ మేరకు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. బాలిక విద్యను ప్రోత్సహించడంలో భాగంగా 25 శాతం సీట్లను వారికి కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఫస్టియర్‌లో ప్రవేశాలకు కంప్యూటర్ సైన్స్ లో 100, ఈసీఈలో 60 సీట్లు ఉన్నాయని, వీటిలో 120 సీట్లను కామన్ పూల్ ద్వారా భర్తీ చేస్తామని, 40 సీట్లను జెండర్ డైవర్సిటీ పూల్ కింద బాలికలకు కేటాయిస్తామని వివరించింది. విద్యార్థులు ఈనెల 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో (https://ugadmissions.iiit.ac.in) దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 60 శాతం చొప్పున మార్కులు సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొంది.
Published date : 16 Sep 2020 01:02PM