టీఎస్ మైనారిటీ రెసిడెన్షియల్‌లో ప్రవేశాలకు ఆహ్వానం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్)లోకి 2020-21 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు.
తమ అధికారిక వెబ్‌సైట్ www.tmreis.telangana.gov.in ద్వారా అర్హులైన మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు (ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జైన్, సిక్కు, బుద్ధిస్ట్), మైనారిటీయేతర (ఎస్సీ, ఎస్టీ ,బీసీ, ఓబీసీలు) విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని టీఎంఆర్‌ఈఐఎస్ కార్యదర్శి బి.షఫీయుల్లా ఒక ప్రకటనలో తెలిపారు. 204 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 5వ తరగతిలో 14,640 సీట్లకు, 83 జూనియర్ కాలేజీల్లో (సెంటర్స్ ఫర్ ఎక్సలెన్సీతో కలిపి) ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి 6,640 సీట్లకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా 6, 7, 8 తరగతులకు మైనారిటీ కేటగిరీల బ్యాక్‌లాగ్ సీట్లను భర్తీచేస్తామన్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం అడ్మిషన్స్ పోర్టల్‌ను శనివారం ప్రభుత్వ మైనారిటీల వ్యవహారాల సలహాదారు, టీఎంఆర్‌ఈఐఎస్ అధ్యక్షుడు ఏకే ఖాన్ ప్రారంభించారు. వచ్చేనెల 20వ తేదీలోగా ఆన్‌లైన్‌లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం విద్యార్థులు www.tmreis.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని, హెల్ప్‌లైన్:040-23437909ను సంప్రదించవచ్చని లేదా జిల్లాల్లో డీఎండబ్ల్యూవో కార్యాలయం లేదా హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 10లోని టీఎంఆర్‌ఈఐఎస్ కార్యాలయం నుంచి సమాచారం పొందవచ్చని వెల్లడించారు.
ఇదీ షెడ్యూల్
ఫలితాల ప్రకటన
5, 6, 7, 8 తరగతులు, ఇంటర్ ఫస్టియర్ :02-05-2020
సర్టిఫికెట్ల పరిశీలన, ప్రవేశాలు
ఇదీ షెడ్యూల్
- 5, 6, 7, 8 తరగతులు, ఇంటర్ ఫస్టియర్‌కు ఆన్‌లైన్‌లో ఉచితంగా దరఖాస్తుల సమర్పణ 22-02-2020 నుంచి 20-03-2020 వరకు ప్రవేశపరీక్షలు
- ఇంటర్ మొదటి సంవత్సరానికి: 12-04-2020
- ఐదో తరగతికి: 18-04-2020
- 6,7,8 తరగతులకు: 20-04-2020
ఫలితాల ప్రకటన
5, 6, 7, 8 తరగతులు, ఇంటర్ ఫస్టియర్ :02-05-2020
సర్టిఫికెట్ల పరిశీలన, ప్రవేశాలు
- 5, 6, 7, 8 తరగతులు, ఇంటర్ మొదటి సంవత్సరానికి 05-05-2020 నుంచి 15-05-2020 వరకు
- 12-06-2020 నుంచి తరగతుల ప్రారంభం
Published date : 24 Feb 2020 03:38PM