తెలుగు వర్సిటీ పరీక్షలు యథాతథం.. భారత్ బంద్‌తో సంబంధం లేదు!
Sakshi Education
నాంపల్లి (హైదరాబాద్): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం నిర్వహించే వార్షిక పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని, డిసెంబర్8న జరిగే భారత్ బంద్‌కు పరీక్షలకు ఎలాంటి సంబంధం ఉండదని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 7 నుంచి 18 వరకు తెలుగు వర్సిటీ అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతాయన్నారు. యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులతో పాటుగా బ్యాక్‌లాగ్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని వివరించారు. భారత్ బంద్ జరిగే మంగళవారం కూడా పరీక్షలు ఉంటాయని, విద్యార్థులు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు.
Published date : 08 Dec 2020 04:33PM