తెలంగాణ సెట్స్ నిర్వహణ ఆగస్టులోనే: తుమ్మల పాపిరెడ్డి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ ఫలితాలతో ముడిపడి ఉన్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలను (సెట్స్) ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.
జూలై చివరి నాటికి డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు పూర్తి అవుతాయని, ఆ తర్వాత సమయం చూసుకొని ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇటీవల ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్ పరీక్ష తేదీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. జూన్, జూలైలో వాటిని నిర్వహించేలా చర్యలు చేపట్టింది. డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు ఎప్పుడు పూర్తవుతాయో కచ్చితమైన వివరాలు లేకపోవడంతో ఎడ్‌సెట్, లాసెట్, ఐసెట్, పీఈసెట్ తేదీలను ఖరారు చేయలేదు. ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను జూలై చివరి నాటికి పూర్తి చేసేలా యూనివర్సిటీలు షెడ్యూలు ఖరారు చేయడంతో ఆగస్టులో ఆయా సెట్స్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఆయా సెట్స్ తేదీలు వెల్లడిస్తామని వివరించారు.
లాసెట్ నోటిఫికేషన్ జారీ
ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన లాసెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లాసెట్ సిలబస్‌ను, టైం టేబుల్‌ను ఖరారు చేశారు. అనంతరం నోటిఫికేషన్ జారీ చేశారు. వచ్చే నెల 24 నుంచి మే 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరించాలని నిర్ణయించారు. లాసెట్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.800గా (ఎస్సీ, ఎస్టీ. వికలాంగులకు రూ.500గా) నిర్ణయించారు. పీజీ లాసెట్ ఫీజును రూ.1,000గా (ఎస్సీ, ఎస్టీ వికలాంగులకు రూ.800) నిర్ణయించారు. విద్యార్థులు జూలై 20 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, పరీక్షలు ఆగస్టులో నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. మరిన్ని వివరాలను https://lawcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో పొందొచ్చని వివరించారు.

Published date : 25 Feb 2021 05:08PM