తెలంగాణ దోస్త్ – 2021 తొలిదశ కౌన్సెలింగ్ పూర్తి.. వీటి ఆధారంగా సీట్లు..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏర్పాటు చేసిన దోస్త్–2021 తొలి దశ సీట్ల కేటాయింపు పూర్తయింది.
బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ తుమ్మల పాపి రెడ్డి అధ్యక్షతన దోస్త్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఉన్న త విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్‌తో పాటు సీజీజీ డైరెక్టర్ జనరల్ నాజేంద్ర నిమ్జే, దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి, టీఎస్‌సీహెచ్‌ఈ వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ మార్కులు, రిజర్వేషన్లు, ఆప్షన్లు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకున్న దోస్త్ కమిటీ... అర్హతల ఆధారంగా సీట్లు కేటాయించింది. మొదటి ప్రాధాన్యత కింద 1,30,064 మంది సీట్లు పొందడం గమనార్హం. మొదటి దశ కౌన్సెలింగ్‌లో రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీల పరిధిలో 950 కాలేజీల్లో 501 రకాల కోర్సులకు సంబంధించి అడ్మిషన్లు జరిగాయి. తొలిదశ కౌన్సెలింగ్ ముగిసే నాటికి 27 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా అడ్మిషన్ తీసుకోలేదు.
సెల్ఫ్ రిపోర్టింగ్‌తో సీటు రిజర్వ్...
మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు సంక్షిప్త సమాచారం పంపినట్లు దోస్త్ కమిటీ వెల్లడించింది. సీట్లు పొందిన అభ్యర్థులు దోస్త్ లాగిన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ ద్వారా రూ.500 లేదా రూ.1000 ఆన్‌లైన్ విధానంలో ఫీజు చెల్లించి సీటును రిజర్వ్ చేసుకోవాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హత ఉన్నవాళ్లు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవడంతో పాటు లాగిన్ ద్వారా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని కమిటీ స్పష్టం చేసింది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుంటే సీటు రద్దవుతుంది. సీటు పొందిన విద్యార్థి మరింత మెరుగైన సీటు కోసం ప్రయత్నించాలనుకుంటే ముందుగా సె ల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత తదుపరి దశలో కౌన్సెలింగ్‌లో పాల్గొని వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న విద్యార్థి నిర్దేశించిన గడువు లోపల కాలేజీలో రిపోర్ట్ చేయకుంటే కూడా సీటు రద్దవుతుంది. దోస్త్–2021 రెండో దశ కౌన్సెలింగ్ ఈనెల 5 నుంచి ప్రారంభమై 18 వరకు కొనసాగుతుంది.

దోస్త్–2021 వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు: | 2,06,044 |
ఆప్షన్లు సమర్పించిన వారు: | 1,81,638 |
సీట్లు పొందిన విద్యార్థులు: | 1,67,310 |
తక్కువ కాలేజీలను ఎంపిక చేసుకోవడంతో సీట్లు పొందలేకపోయిన వారు: | 14,508 |
Published date : 05 Aug 2021 03:41PM