టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో ఎల్‌పీయూ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్–2021లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ) చోటు సాధించింది.
వరల్డ్ టాప్–200 యూనివర్సిటీల జాబితాలో భారత్ నుంచి మూడు యూనివర్సిటీలు చోటు సంపాదించుకోగా అందులో ఎల్‌పీయూ రెండో స్థానంలో నిలిచింది. పోటీచేసిన మొదటిసారే అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాలో స్థానం సంపాదించి ఎల్‌పీయూ సత్తాచాటింది. తొలిసారిగా వరల్డ్ టాప్–200 జాబితాలో చోటు సంపాదించడం గర్వంగా భావిస్తున్నామని ఎల్‌పీయూ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ పేర్కొన్నారు.
Published date : 24 Apr 2021 03:58PM