SCCL Staff Nurse 2021 Results: సింగరేణి స్టాఫ్‌నర్స్ పరీక్షకు 7,666 మంది హాజరు
Sakshi Education
సింగరేణి (కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోని వివిధ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 84 జూనియర్ స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు 7,666 మంది హాజరయ్యారని సింగరేణి డైరెక్టర్ ఎన్.బలరాం తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో 18 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. 150 మార్కులకు పరీక్ష ఉంటుందని, ఇందులో ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు కనీసం 30 శాతం, బీసీ, ఓసీ అభ్యర్థులకు 35 శాతం మార్కులు వస్తేనే ఉత్తీర్ణతకు అర్హులవుతారని ఆయన మీడియాకు చెప్పారు. సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల వారిని లోకల్, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల వారిని నాన్ లోకల్ అభ్యర్థులుగా పరిగణిస్తామన్నారు. పరీక్ష ఫలితాలను ఆదివారం రాత్రి నుంచే www.ssclmines.com వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని, సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద నోటీస్‌బోర్డులో కూడా అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
Published date : 30 Aug 2021 03:50PM