స్టార్టప్‌లతో గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు: గవర్నర్ విశ్వభూషణ్
Sakshi Education
సాక్షి, అమరావతి/నరసరావుపేట రూరల్: స్టార్టప్ కంపెనీలకు సహకరించేందుకు రూ.వెయి్య కోట్లతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్’ను యువ టెక్నోక్రాట్లు సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు.
కేంద్ర శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి సంస్థ, జేఎన్‌టీయూకే సహకారంతో నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో నెలకొల్పనున్న ‘ఆంధ్ర టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్’కు ఆయన శుక్రవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ టెక్నాలజీ ఇంక్యుబేటర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగాల కల్పనకు దోహదపడతాయన్నారు. ఈ ఇంక్యుబేషన్ సెంటర్ స్టార్టప్ కంపెనీలకు సాంకేతిక సహకారాన్ని అందించనుండటం సంతోషకరమన్నారు. తయారీ, వ్యవసాయ, ఇంధన, ఐవోటీ రంగాల్లో స్టార్టప్ కంపెనీలకు విసృ్తత అవకాశాలున్నాయన్నారు.
Published date : 06 Feb 2021 03:38PM