Skip to main content

స్కూల్ బ్యాండ్ పోటీల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

సాక్షి, అమరావతి/బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్కూల్ బ్యాండ్ పోటీల్లో ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థకు చెందిన ఇంటర్ విద్యార్థులు మూడో బహుమతి గెలుచుకున్నారు.
ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నిషాంక్ చేతుల మీదుగా విద్యార్థులు బహుమతి అందుకున్నారు. ఈ పోటీలు జనవరి 23 (గురువారం)నఢిల్లీలో జరిగాయి. ఇందులో ఐదు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి విద్యార్థులు పాల్గొనగా ఏపీ నుంచి పాల్గొన్న గురుకుల విద్యార్థులు బ్యాగ్‌పైప్ బ్యాండ్‌లో మూడో బహుమతి సాధించారు. మొదటి బహుమతి పంజాబ్‌కు, రెండో బహుమతి రాజస్థాన్ విద్యార్థులకు లభించాయి. గురుకుల విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర అభినందించారు.

విశాఖ బాలికకు బాలశక్తి పురస్కారం
కళలు, సంస్కృతి రంగంలో అపూర్వ విజయాలు సాధించినందుకు విశాఖకు చెందిన ఎం.శరణ్యకు ‘బాల శక్తి పురస్కార్-2020’ ను రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ అందజేశారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన అవార్డుల ఉత్సవాల్లో పురస్కారం కింద రూ.లక్ష నగదు, ఒక ట్యాబ్, పతకం, ప్రశంసాపత్రం అందజేశారు. అలాగే, ప్రధాని మోదీని కలిసేందుకు, రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనేందుకు శరణ్యకు ఆహ్వానం లభించింది. గ్రీస్, బల్గేరియా, జోహన్స్ బర్గ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ బాలల దినోత్సవంలో శరణ్య భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది.
Published date : 24 Jan 2020 01:38PM

Photo Stories