సీబీఎస్‌ఈ పరీక్షలు రాతపూర్వకంగానే.. ఆన్‌లైన్ కాదు!
Sakshi Education
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే బోర్డు పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో ఉండవని, రాతపూర్వకంగానే ఉంటాయని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది.
పరీక్షల నిర్వహణ తేదీలపై సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పింది. ఒకవేళ విద్యార్థులు పరీక్షలకు ముందు ప్రాక్టికల్స్ చేయలేకపోతే దానికి సంబంధించి ప్రత్యామ్నాయాలు చూస్తామంది. దీనిపై కేంద్ర మంత్రి నిశాంక్ పోఖ్రియాల్ డిసెంబర్ 10న విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులతో చర్చిస్తారని అధికారులు చెప్పారు.
Published date : 03 Dec 2020 05:19PM