సెప్టెంబర్ 30న బీసీ గురుకుల కాలేజీల ప్రవేశ పరీక్ష
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని జూనియర్ కాలేజీ, మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 30న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 24 నుంచి హాల్‌టికెట్లను సొసైటీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Published date : 18 Sep 2020 03:19PM