సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మనూ ప్రవేశ పరీక్షలు
Sakshi Education
రాయదుర్గం: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలను గురువారం యూనివర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ సిద్దిఖీ మహ్మద్ మహమూద్ ప్రకటించారు.
ఈనెల 28, 29, 30వ తేదీలలో ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాల కోసం అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్ manuu.edu.in ను సందర్శించాలని సూచించారు. ఇదిలా ఉండగా మెరిట్ ఆధారంగా పీజీ, యూజీ, బ్రిడ్‌జ కోర్సులలో రెగ్యులర్ మోడ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు సెప్టెంబర్ 30వ తేదీతో ముగుస్తుందని వివరించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు పత్రంతో పాటు కోర్సుల వివరాలు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
Published date : 11 Sep 2020 02:42PM