Skip to main content

సెప్టెంబర్ 21 నుంచే పాఠశాలలు పునఃప్రారంభం: టీఎస్ విద్యాశాఖ

సాక్షి, హైదరాబాద్: విద్యా సంస్థలను ఈనెల 21వ తేదీ నుంచి తెరవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రోజుకు 50% సిబ్బంది మాత్రమే హాజరు కావాలని ఆదేశించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్-4 మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జీఓ 120 జారీ చేశారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారాంచంద్రన్ శుక్రవారం మెమో 3552 జారీ చేశారు. ఈ మెమో ప్రకారం విద్యా సంస్థలను ఈనెల 21వ తేదీ నుంచి తెరవాలని, రోజుకు బోధన, బోధనేతర సిబ్బందిలో 50శాతం మాత్రమే విధులకు హాజరు కావాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆన్‌లైన్/ వీడియో తరగతులు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలు తెరిచే వరకు బోధన సిబ్బంది అంతా వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిని పాటిస్తూ విద్యార్థులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 20వరకు టీచర్లు ఇంటి నుంచే పని చేయవచ్చు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్, కళాశాల విద్యా కమిషనర్, సాంకేతిక విద్యా కమిషనర్, ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్లను ఆదేశించారు.
Published date : 12 Sep 2020 01:40PM

Photo Stories