సెప్టెంబర్ 1, 2 తేదీల్లో బ్యాక్‌లాగ్ పోస్టుల ధ్రువపత్రాల పరిశీలన
Sakshi Education
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల నియామకాల ధ్రువపత్రాల పరిశీలన సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నిర్వహించనున్నట్లు సంస్థ కార్యదర్శి బి.నవ్య సోమవారం తెలిపారు.
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రత్యక్ష నియామకం ద్వారా ప్రిన్సిపాల్ (గ్రేడ్–2)–1, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(టీజీటీ)–38, కేర్ టేకర్ (వార్డెన్స్)–7 ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ ఖాళీల భర్తీ ప్రక్రియ తుది దశకు వచ్చిందని తెలిపారు. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ముందుగా ఆగస్టు 25, 26 తేదీల్లో జరగాల్సి ఉందని, దాన్ని సెప్టెంబర్ 1, 2 తేదీలకు మార్పు చేసినట్లు తెలిపారు. ఇందుకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను www.apswreis.info , www.jnanabhumi.ap.gov.in లో పొందుపరిచామన్నారు. అర్హులైన అభ్యర్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు సంక్లిప్త సందేశం పంపినట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో తాడేపల్లిలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయానికి రావాలని సూచించారు.
Published date : 24 Aug 2021 03:24PM