Skip to main content

సైనిక్‌ స్కూల్‌ ఫలితాల్లో ఎస్సీ కేటగిరిలో ఐదో ర్యాంక్‌ సాధించిన విద్యార్థికి అభినందన‌

సైనిక్‌ స్కూల్‌ తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్ష జనవరి 9న నిర్వహించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ప్రీమియర్‌ అకాడమీ స్టూడెంట్‌ దార్ల వెంకట శశికుమార్‌ ఎస్సీ కేటగిరిలో ఐదో ర్యాంకు సాధించాడు.
ఈ సందర్భంగా సోమవారం అకాడమీ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్‌ సిహెచ్‌.వి. సుబ్రహ్మణ్యం, కో–ఆర్డినేటర్‌ ఎస్‌.సహజ విద్యార్థికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. శశికుమార్‌ మాట్లాడుతూ.. ర్యాంకు సాధించడానికి కారణమైన తల్లిదండ్రులు, సంస్థ డైరెక్టర్‌కి ధన్యవాదాలు తెలిపాడు.
Published date : 30 Mar 2021 12:48PM

Photo Stories