Skip to main content

సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు మెరిట్‌ జాబితా సిద్ధం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖలో ఫోరెన్సిక్‌ సైన్స్ ల్యాబోరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌)లో 58 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు మెరిట్‌ జాబితా సిద్ధం చేసినట్లు ఏపీ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) చైర్మన్ హరీష్‌కుమార్‌ గుప్త సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ పోస్టులకు 8,127 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేయగా రాతపరీక్షలో 3,481 మంది ఎంపికైనట్లు పేర్కొన్నారు. వారి ధ్రువపత్రాల పరిశీలన అనంతరం మెరిట్‌ లిస్ట్‌ ఎంపిక చేసి www.slprb.ap.gov.in  వెబ్‌సైట్‌లో పెట్టినట్లు తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 11 వ తేదీలోపు అభ్యంతరాలను apslprb.fslobj@ gmail.com కు తెలపాలని హరీష్‌కుమార్‌గుప్త సూచించారు.
Published date : 09 Mar 2021 04:41PM

Photo Stories