రోజు విడిచి రోజు విధులకు హైకోర్టు ఉద్యోగులు
Sakshi Education
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమ భద్రత నిమిత్తం తగిన చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఉద్యోగుల సంఘం చేసిన అభ్యర్థనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి సానుకూలంగా స్పందించారు.
50 శాతం మంది ఉద్యోగులు రోజు విడిచి రోజు విధులకు హాజరయ్యేందుకు సీజే అనుమతినిచ్చారు. అయితే.. జాయింట్ రిజిస్ట్రార్లు, సెక్షన్ ఆఫీసర్లు, న్యాయమూర్తుల పీఎస్‌లు, కోర్ట్ మాస్టర్లు విధులకు రోజూ హాజరు కావాలని ఆదేశించారు. జ్యుడిషియల్ సెక్షన్‌లో ఎంతమంది సిబ్బంది ఉండాలన్నది జ్యుడిషియల్ రిజిస్ట్రార్ నిర్ణయిస్తారు. రిజిస్ట్రార్లు ఆదేశించినప్పుడు విధులకు హాజరయ్యేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలి. ఉద్యోగులెవరూ ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదు. కోవిడ్ ప్రొటోకాల్స్‌ను తూచా తప్పకుండా పాటించాలి. తమ సమస్యలను అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించినందుకు సీజేకు హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ.వేణుగోపాలరావు, కార్యదర్శి సతీష్ వర్మ కృతజ్ఞతలు తెలిపారు.
Published date : 23 Apr 2021 03:39PM