రిటైరైన వెంటనే ప్రైవేట్ సంస్థల్లో చేరుతారా? ..అది తీవ్రమైన దుష్ప్రవర్తన..
Sakshi Education
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల నుంచి పదవీ విరమణ చేసిన వెంటనే ప్రైవేట్ రంగ సంస్థల్లో చేరడం తీవ్రమైన దుష్ప్రవర్తన అని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఆక్షేపించింది.
పోస్టు–రిటైర్‌మెంట్ జాబుల్లో ప్రభుత్వ ఉద్యోగులను చేర్చుకోవాలంటే ముందుగా తమ (సీవీసీ) అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వ రంగ సంస్థలకు స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల అధినేతలకు గురువారం ఒక ఉత్తర్వు జారీ చేసింది. కొందరు అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వ సంస్థల నుంచి రిటైరైన వెంటనే ప్రైవేట్ సంస్థల్లో ఫుల్‌టైమ్/ కాంట్రాక్టు ఉద్యోగులుగా చేరుతున్నారని, ఇలా చేయడం తీవ్రమైన దుష్ప్రవర్తనే అవుతుందని సీవీసీ తేల్చిచెప్పింది. వాస్తవానికి ఇలా చేరడానికి సంబంధిత ప్రభుత్వ సంస్థల నియమ నిబంధనల ప్రకారం కొంత గడువు (కూలింగ్ ఆఫ్ పీరియడ్) ఉంటుందని, దాన్ని ఎవరూ లెక్కచేయడం లేదని తప్పుపట్టింది. నిబంధనలు ఉల్లంఘించిన రిటైర్డ్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని తెలిపింది.
సీవీసీ నుంచి క్లియరెన్స్ వచ్చాకే..
పదవీ విరమణ చేసిన అధికారులను ప్రభుత్వ సంస్థలో మళ్లీ నియమించుకుంటున్నారని, ఈ విషయంలో ఒక విధానం అంటూ లేదని సీవీసీ పేర్కొంది. ఆరోపణలున్న వారికి, కేసులు పెండింగ్‌లో ఉన్నవారికి మళ్లీ ఫుల్‌టైమ్ ఉద్యోగాలు ఇస్తున్నారని, దీనివల్ల సమస్యలు వస్తున్నాయని గుర్తుచేసింది. సీవీసీ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే రిటైర్డ్ ఉద్యోగులను మళ్లీ నియమించుకోవాలని తేల్చిచెప్పింది. ఈ విషయంలో పారదర్శకత పాటించాలని సూచించింది.

Published date : 04 Jun 2021 04:17PM