రెండు రోజుల్లోగా నిర్ణయం తీసుకోండి.. ‘ఐసెట్’ స్పెషల్ కౌన్సెలింగ్‌పై హైకోర్టు ఆదేశం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల కోసం ఐసెట్ స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరుతూ ఐసెట్ కన్వీనర్ రాసిన లేఖపై ఇంతవరకు ఎందుకు స్పందించలేదని ఉన్నత విద్యాశాఖను హైకోర్టు ప్రశ్నించింది.
దీనిపై 48 గంటల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది. సప్లిమెంటరీ ఫలితాలు రాకముందే కౌన్సెలింగ్ నిర్వహించడంతో కొందరు విద్యార్థులు నష్టపోతారని, అందువల్ల వీరి కోసం స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ తెలంగాణ రిపబ్లిక్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎ.ఆనంద్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది.
Published date : 19 Jan 2021 04:18PM