రేపే ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చ’...
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు, వారిలో ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపుచేసేందుకు ప్రతీ ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది.
7వ తేదీన విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులతో రాత్రి ఏడు గంటలకు ఆన్‌లైన్ వేదికగా నిర్వహించనున్నట్లు ప్రధాని మోదీ సోమవారం ట్వీట్‌చేశారు. 2018 ఫిబ్రవరి 16న తొలిసారిగా ఢిల్లీలో పరీక్షా పే చర్చ కార్యక్రమానికి మోదీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా విద్యార్థులతో నేరుగా కలిసే అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని, అందుకే వర్చువల్ ఎడిషన్ లో నిర్వహించనున్నట్లు ప్రధాని తెలిపారు. విద్యార్థులను ‘ఎగ్జామ్స్ వారియర్స్’గా పేర్కొన్న మోదీ.. కొత్త నమూనాలో అనేక విషయాలకు సంబంధించిన ఆసక్తిని రేకెత్తించే ప్రశ్నలతో ఒక చిరస్మరణీయ చర్చ జరుగనుందని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం క్లిక్ చేయండి.
Published date : 06 Apr 2021 02:33PM