ఫీజు రీయింబర్స్‌మెంట్ హర్షణీయం: ఏబీవీపీ
Sakshi Education
సాక్షి, అమరావతి: కరోనా విపత్తు, లాక్‌డౌన్‌ల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా జగనన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం నిధులు విడుదల చేయడం హర్షణీయమని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు (ఏబీవీపీ) సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు నాగోతు హరికృష్ణ అన్నారు.
ఈ పథకం కింద రూ.4,000 కోట్లకు పైగా విడుదల చేయడం, గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,880 కోట్ల బకాయిలు కూడా చెల్లించడం గొప్పవిషయమన్నారు.
Published date : 29 Apr 2020 04:39PM