ఫిబ్రవరి 25 నుంచి ఏపీ లాసెట్–2020 రెండో విడత కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీ లాసెట్–2020 అడ్మిషన్ల కౌన్సెలింగ్లో భాగంగా తొలివిడత సీట్ల కేటాయింపు ప్రక్రియ సోమవారం నిర్వహించారు.
లాసెట్–2020 వివరాలు..
మొదటి విడతలో 4,635 మందికి సీట్లు కేటాయించారు. వీరిలో ఎల్‌ఎల్‌ఎం అభ్యర్థులు 319 మంది, ఎల్‌ఎల్‌బీ (3 ఏళ్లు) 3,325, ఎల్‌ఎల్‌బీ (5 ఏళ్లు) 991 మంది ఉన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
రెండో విడత షెడ్యూల్ ఇలా..
రెండో విడత షెడ్యూల్ ఇలా..
రిజిస్ట్రేషన్ల ఫీజు చెల్లింపు గడువు: | ఫిబ్రవరి 25, 26 |
ధ్రువపత్రాల పరిశీలన: | ఫిబ్రవరి 25, 26 |
వెబ్ ఆప్షన్లు: | ఫిబ్రవరి 26 |
సీట్ల కేటాయింపు: | ఫిబ్రవరి 28 |
కాలేజీల్లో రిపోర్టు: | మార్చి1 నుండి 3వ తేదీ వరకు |
లాసెట్–2020 వివరాలు..
రిజిస్ట్రేషన్ అయిన వారు | 18,371 |
పరీక్షకు హాజరైన వారు | 12,284 |
అర్హత సాధించిన వారు | 11,222 |
మొత్తం కాలేజీలు | 39 |
మొత్తం సీట్లు | 8,318 |
Published date : 23 Feb 2021 05:01PM