ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్స్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా జనరల్ విద్యార్థులకు 1,506 కేంద్రాలను, ఒకేషనల్ విద్యార్థులకు 416 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్ష సమయం కంటే అరగంట ముందు ఆన్‌లైన్ ద్వారా ప్రశ్నపత్రాలను పంపించేలా చర్యలు చేపట్టింది. ప్రిన్సిపాళ్లు తమ రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారంగా ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్ చేసి ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఒకవేళ ఎక్కడైనా ప్రిన్సిపాళ్లకు ఓటీపీ రాకపోయినా, ప్రశ్నపత్రం బ్లాంక్‌గా కనిపించినా వారు వెంటనే సంబంధిత జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈవో)ని సంప్రదించాలని ఆదేశాలు జారీచేసింది. సంబంధిత ప్రిన్సిపాల్‌కు వెళ్లే ప్రతి ఓటీపీని, ప్రశ్నపత్రాలను చూసే యాక్సెస్ వారికి ఇస్తోంది. తద్వారా వారు సంబంధిత ప్రిన్సిపాల్‌కు ఓటీపీని తెలియజేయడం ద్వారా వారు ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్ చేసుకునే వీలు కలుగుతుందని, ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొంది. మార్కులను కూడా ఆన్‌లైన్లో వెంటనే వేసి పంపించేలా చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 2,47,915 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు హాజరుకానున్నారు. అందులో ఎంపీసీ విద్యార్థులు 1,55,454 మంది, బైపీసీ విద్యార్థులు 91,881 మంది, జాగ్రఫీ విద్యార్థులు 580 మంది ఉన్నారు. వారికి నిర్ణీత తేదీల్లో ఉదయం, సాయంత్రం బ్యాచ్‌ల వారీగా ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనుంది.
‘ఎథిక్స్’పరీక్షకు 4,80,516 మంది
జనవరి 28వ తేదీన నిర్వహించనున్న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ పరీక్షకు 4,80,516 మంది హాజరు కానున్నారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదివే విద్యార్థులే కాకుండా, గతంలో హాజరు కాని వారు, ఫెయిలైన వారు ఈ పరీక్షకు హాజరయ్యేలా చర్యలు చేపట్టింది. పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఇక ఈనెల 30న అదే విద్యార్థులకు ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను కూడా నిర్వహించనుంది. ఇంటర్ విద్యార్థులు ఈ రెండు పరీక్షల్లో కచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాల్సిందే.

Published date : 28 Jan 2020 02:48PM