Skip to main content

ప్రైవేట్‌ పాఠశాలలను టెన్త్‌ పరీక్షా కేంద్రాలుగా ఇవ్వొద్దు: ట్రస్మా

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే నెలలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు ప్రైవేటు పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా ఇవ్వాలని అధికారులు అడుగుతున్నారని తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) ప్రతినిధులు యాదగిరి శేఖర్‌రావు, సాదుల మధుసూదన్‌, ఐవీ రమణారావు పేర్కొన్నారు.
అయితే ప్రైవేట్‌ పాఠశాలలను టెన్త్‌ పరీక్షా కేంద్రాలుగా ఇవ్వొద్దని వారు పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్రస్మా ప్రతినిధులు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు వాట్సాప్‌ మెసేజ్‌లను పంపించారు.

తెలంగాణ టెన్త్‌ – 2021 సిలబస్, స్టడీ మెటీరియల్, బిట్‌ బ్యాంక్స్, ఎగ్జాం టైం టేబుల్, ప్రిపరేషన్‌ టిప్స్, మోడల్‌ పేపర్స్, కెరీర్‌ గైడెన్స్‌... ఇతర తాజా అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

అధికారులు ఎవరైనా స్కూలుకు వచ్చి పరీక్షా కేంద్రంగా ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినా ఇవ్వొద్దని ట్రస్మా నిర్ణయించినట్లు ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. పాఠశాలల భవనాల అద్దె చెల్లించనందున, భవన యజమానులు తాళాలు వేశారని, విద్యుత్‌ బిల్లులు చెల్లించనందున విద్యుత్‌ శాఖ వారు సరఫరా నిలిపివేశారని అందులో పేర్కొన్నారు. అలాగే తాగునీరు లేదని, సిబ్బంది కూడా రావడం లేదని, పాఠశాలలు దుమ్ము, ధూళి తో నిండిపోయి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తేనే పరీక్షలకు కేంద్రాలుగా భవనాలను ఇస్తామని ముక్తకంఠంతో తెలియజేయాలని యాజమాన్యాలకు సూచించారు. పెండింగ్‌ బిల్లులు, అద్దె చెల్లించి పాఠశాలల భవనాలను వాడుకోవాలని అధికారులకు సూచించాలని పేర్కొన్నారు.
Published date : 09 Apr 2021 02:52PM

Photo Stories