Skip to main content

ప్రభుత్వ టీచర్లకు ఆంగ్ల భాషా పరిజ్ఞానం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) చర్యలు చేపట్టింది.
ఇందుకోసం అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ (ఏపీయూ)తో కలసి 9 వారాల సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించనున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సును ముఖాముఖి, ఆన్‌లైన్ పద్ధతుల్లో నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు https://rcert.telangana.gov.in ద్వారా గురువారం నుంచి దరఖాస్తులు సమర్పించవచ్చని వెల్లడించారు. ప్రతి పాఠశాలకు ఒక టీచర్ మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ప్రాధాన్య పద్ధతిలో మొదట వచ్చిన 1,000 మందిని మొదటి బ్యాచ్‌లో చేర్చుకోనున్నట్లు తెలిపారు.
Published date : 05 Mar 2020 04:36PM

Photo Stories