ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల హాజరు పెరుగుతోంది: ఆదిమూలపు సురేష్
Sakshi Education
సాక్షి, అమరావతి: కోవిడ్ జాగ్రత్తలతోనే ప్రభుత్వ స్కూళ్లు నిర్వహిస్తున్నామని.. విద్యార్థుల హాజరు శాతం కూడా క్రమంగా పెరుగుతోందని విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
స్కూళ్లు ప్రారంభించినప్పుడు 40-50 శాతం మధ్య ఉన్న విద్యార్థుల హాజరు.. ఇప్పుడు 60 శాతానికి చేరిందన్నారు. రోజూ 50 శాతానికి తగ్గకుండా తరగతులకు హాజరవుతున్నారని చెప్పారు. గుంటూరు జిల్లాలో విద్యార్థుల హాజరు శాతం ఎక్కువగా ఉందని వివరించారు. పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తుండటంతో ఈనెల 14 తర్వాత 6, 7 తరగతులు ప్రారంభించబోతున్నామని చెప్పారు.
Published date : 10 Dec 2020 04:01PM