ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పెరిగిన ప్రవేశాలు: సబిత ఇంద్రారెడ్డి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ ఏడాది ప్రవేశాలు గణ నీయంగా పెరిగాయని, ఇప్పటివరకు 405 ప్రభుత్వ కాలేజీల్లో 1,09,020 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందినట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
కొత్తగా రూపొందించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఆంగ్ల, ద్వితీయ సంవత్సరం తెలు గు పాఠ్య పుస్తకాలను మంత్రి గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు. వీటిని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయ నున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం చేపట్టిన ఉచిత కోచింగ్‌కు 20,823 మంది హాజరయ్యారని, వీరిలో 4 వేల మంది ఇతర రాష్ట్రాల వారన్నారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: వ్యవసాయ డిప్లొమా ప్రవేశాలకు ఆగస్టు 26 వరకు గడువు పెంపు
చదవండి: వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ కంపెనీలో 2,000 మందికి పైగా నియామకాలు..!
చదవండి: వ్యవసాయ డిప్లొమా ప్రవేశాలకు ఆగస్టు 26 వరకు గడువు పెంపు
చదవండి: వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ కంపెనీలో 2,000 మందికి పైగా నియామకాలు..!
Published date : 13 Aug 2021 02:56PM