‘ప్రాథమిక’ టీచర్ల పనివేళలు, విధులపై స్పష్టత
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాథమిక స్కూళ్ల టీచర్ల పనివేళలు, చేపట్టాల్సిన విధులపై స్పష్టత ఇస్తూ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు స్కూళ్లలో పనిచేయాలని టీచర్లకు స్పష్టం చేసింది. బయోమెట్రిక్ హాజరుపై ఇంతకు ముందు ఇచ్చిన నిబంధనలు అమలవుతాయని పేర్కొంది. అంగన్‌వాడీలు, పేరెంట్స్ కమిటీల సహకారంతో బడి ఈడు పిల్లలను గుర్తించి వారిని సూళ్లలో చేర్పించాలని సూచించింది. జగనన్న విద్యా కానుక కిట్స్, డ్రై రేషన్ పంపిణీ చేయడంతో పాటు రికార్డులు సరిగా నిర్వహించి.. ఆ డేటాను మొబైల్ యాప్‌లో ఎంట్రీ చేయాలని పేర్కొంది. నెలవారీ ప్రణాళికలను తయారు చేసుకోవడంతో పాటు విద్యార్థుల వర్క్‌బుక్స్ పరిశీలించాలని సూచించింది. వారానికి ఒకసారి పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి.. స్కూళ్లు ప్రారంభమైన తర్వాత పిల్లలను పంపించేలా చైతన్యపరచాలని ఆదేశించింది. పిల్లల ఆన్‌లైన్ విద్యా కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ.. సందేహాలను నివృత్తి చేయాలని సూచించింది. ట్రైనింగ్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని.. నూతన విద్యా విధానంపై అవగాహన పెంచుకోవాలని ఆదేశించింది.
Published date : 09 Dec 2020 02:55PM