Skip to main content

ప్రాక్టికల్స్, ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌లను జూన్‌ 28లోగా అప్‌లోడ్‌ చేయండి

సాక్షి, న్యూఢిల్లీ: విద్యార్థుల ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ను కొన్ని పాఠశాలలు పూర్తి చేయని నేపథ్యంలో గడువు జూన్‌ 28 వరకు పెంచుతున్నట్లు సీబీఎస్‌ఈ పేర్కొంది.
ఈ నెల 11 లోగా మార్కులు అప్‌లోడ్‌ చేయాల్సి ఉన్నప్పటికీ కరోనా నేపథ్యంలో కొన్ని పాఠశాలలు ఇంకా చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రాక్టికల్స్‌/ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ఈ నెల 28లోగా అప్‌లోడ్‌ చేయాలని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. పెండింగ్‌లో ఉన్న పాఠశాలల్లో ప్రాక్టికల్స్, ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ను ఆన్‌లైన్‌ విధానంలోనే పూర్తి చేయాలని ఆదేశించింది. సబ్జెక్టుకు సంబంధించి ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్‌ అపాయింట్‌ కాకపోతే సబ్జెక్టు ఉపాధ్యాయులే ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ పూర్తి చేయాలని పేర్కొంది. ‘వైవా ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించాలి. పరీక్ష తేదీని ఇంటర్నల్‌ ఎగ్జామినర్‌ ముందుగానే విద్యార్థులకు తెలియజేయాలి. నిబంధనల మేరకు అసెస్‌మెంట్‌ చేయాలి’ అని సీబీఎస్‌ఈ పేర్కొంది.
Published date : 08 Jun 2021 01:49PM

Photo Stories