Skip to main content

పీజీఈసెట్ కౌన్సెలింగ్‌లో 1,619 మందికి సీట్లు

సాక్షి, హైదరాబాద్: ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ, ఎం.ఫార్మ్(పీబీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో 1,619 మందికి సీట్లు లభించినట్లు పీజీఈసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ రమేష్ బాబు తెలిపారు.
సీట్ల కేటాయింపును సోమవారం ప్రకటించినట్లు ఆయ న వెల్లడించారు. ఈ కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉన్న మొత్తం 3,627 సీట్లకు 3,351 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఫీజు చెల్లించిన చలానా, జాయినింగ్ లెటర్, ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 9 నుంచి 12వ తేదీలోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలని ఆయన సూచించారు.
Published date : 09 Feb 2021 04:01PM

Photo Stories