పేదరికంతో ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదు : వైఎస్ జగన్
Sakshi Education
సాక్షి, అమరావతి : పేదరికం వల్ల ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదని, పిల్లల చదువుల కోసం కుటుంబం అప్పుల పాలయ్యే పరిస్థితి ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి చదువు ఒక్కటే అని పునరుద్ఘాటించారు. అందుకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం (జగనన్న విద్యా దీవెన) అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఏప్రిల్ 28న ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లాల కలెక్టర్లు, విద్యార్థులు, వారి తల్లులతో వీడియో కాన్ఫరెన్‌సలో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
‘‘ నేను ఈ రోజు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కుటుంబ సభ్యుడిగా ప్రతి తల్లికీ చెబుతున్నా. మీ పిల్లలను గొప్పగా చదివించండి. మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు సీఎం స్థానంలో ఉన్నాడు.. అన్ని రకాలుగా మీ పిల్లలను చదివిస్తాడని హామీ ఇస్తున్నా’’ .
ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మతో నాలుగు మాటలు పంచుకుంటున్నాను. పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అంటే.. అది చదువులు అని వేరే చెప్పాల్సిన పని లేదు. కుటుంబం నుంచి ఒక్క పిల్లాడన్నా ఇంజనీరో, డాక్టరో లేదా కలెక్టర్ అయితేనే పెద్ద జీతాలు వస్తాయి. ఇంటికి కాస్తో కూస్తో డబ్బులు పంపించగలుగుతాడు. అప్పుడే ఆర్థిక స్థితిగతులతో పాటు మన బతుకులు మారతాయి.
తొలుత నాన్నగారి ఆలోచన ఇది...
అప్పుడు వచ్చింది ఈ ఆలోచన...
రాష్ట్ర చరిత్రలో తొలిసారి...
అడిగే హక్కు ఉంటుంది..
ఇక కొత్త ఒరవడి..
కరోనా కష్టాలున్నా మాట నిలుపుకున్నాం..
‘‘ నేను ఈ రోజు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కుటుంబ సభ్యుడిగా ప్రతి తల్లికీ చెబుతున్నా. మీ పిల్లలను గొప్పగా చదివించండి. మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు సీఎం స్థానంలో ఉన్నాడు.. అన్ని రకాలుగా మీ పిల్లలను చదివిస్తాడని హామీ ఇస్తున్నా’’ .
ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మతో నాలుగు మాటలు పంచుకుంటున్నాను. పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అంటే.. అది చదువులు అని వేరే చెప్పాల్సిన పని లేదు. కుటుంబం నుంచి ఒక్క పిల్లాడన్నా ఇంజనీరో, డాక్టరో లేదా కలెక్టర్ అయితేనే పెద్ద జీతాలు వస్తాయి. ఇంటికి కాస్తో కూస్తో డబ్బులు పంపించగలుగుతాడు. అప్పుడే ఆర్థిక స్థితిగతులతో పాటు మన బతుకులు మారతాయి.
తొలుత నాన్నగారి ఆలోచన ఇది...
- ఈ రోజు ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు నాన్న గారి హయాంలో మొట్టమొదటగా 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక, అంతకు ముందు ఎవ్వరూ చేయని ఆలోచన చేశారు. పేదరికం అన్నది పోవాలంటే కచ్చితంగా కుటుంబం నుంచి పెద్ద చదువులు చదవాలని భావించారు. అప్పులపాలు కాకుండా తమ పిల్లలను ఇంజినీర్లు, డాక్టర్లు వంటి పెద్ద చదువులు చదివిస్తేనే పేద వారి తలరాతలు మారతాయని ఆలోచించి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తీసుకొచ్చారు.
- రాష్ట్రంలో నాన్నగారు ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు ఒక భరోసా ఉండేది. ముఖ్యమంత్రి స్థానంలో ఒక మనసున్న మహారాజు ఉన్నందున తమ బతుకులు, తల రాతలు మారతాయన్న భరోసా ప్రతి ఒక్కరికీ ఉండేది.
- 2009లో నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ పథకాన్ని పూర్తిగా నీరు గారుస్తూ పోయారు. చివరకు ఇచ్చామంటే ఏదో ఇచ్చామన్నట్లుగా.. ఫీజులు ఎలా ఇవ్వాలి అని ఆలోచన చేయకుండా, ఫీజులు ఎలా కత్తిరించాలి అని ఆలోచించారు. రకరకాల షరతులు పెట్టి, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పూర్తిగా నీరు గార్చారు.
అప్పుడు వచ్చింది ఈ ఆలోచన...
- నిజంగా పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, అందుకు రెండే రెండు కారణాలు. ఒకటి చదువు.. రెండోది ఆ పేదవాడు అనుకోకుండా అనారోగ్యానికి గురవ్వడం. ఈ రెండు కారణాల వల్ల పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని ఆ రోజు అనుకున్నాను. ఈ రోజు దేవుడి దయ, అందరి ఆశీర్వాదంతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడమే కాకుండా మరొక అడుగు ముందుకు వేశా.
- ఫీజు రీయింబర్స్‌మెంట్ (విద్యా దీవెన) పథకానికి తోడు పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల భారం తల్లిదండ్రుల మీద పడకుండా వసతి దీవెన పథకాన్నీ తీసుకొచ్చాం. ఈ పథకాన్ని మొన్న జనవరిలోనే ప్రారంభించాం. ఈ రెండు పథకాలు తీసుకొచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
రాష్ట్ర చరిత్రలో తొలిసారి...
- రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మార్చి 31 వరకు ఒక్క రూపాయి బకాయి లేకుండా మొత్తం చెల్లించాం. 2018-19 సంవత్సరానికి అంటే గత ప్రభుత్వం ఫీజుల రీయింబర్స్‌మెంట్‌లో పెట్టిన బకాయిలు.. దాదాపు రూ.1,880 కోట్లు కట్టాము.
- ఈ సంవత్సరం అంటే 2019-20కు సంబంధించి.. అంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన ఫీజులు మొత్తం మార్చి 31వ తేదీ వరకు పూర్తిగా గత ప్రభుత్వ బకాయిలతో కలిపి రూ.4 వేల కోట్లకు పైగా కట్టగలిగాం అని గర్వంగా చెబుతున్నా.
- కాలేజీ యాజమాన్యాలకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా పూర్తిగా ఫీజులు చెల్లించాం కాబట్టి, ఈ పథకాన్ని ఒక అడుగు ముందుకు తీసుకుపోతున్నాం. వచ్చే జూన్‌లో కాలేజీలు తిరిగి తెరుస్తారు. ఆ కాలేజీల్లో కొత్తగా చేరే వారు చేరుతారు. ఇప్పటికే అడ్మిషన్ పొందిన వారు కాలేజీలకు వస్తారు. మళ్లీ కొత్తగా 2020-21 విద్యా సంవత్సరం మొదలవుతుంది. ఇప్పటి నుంచి ప్రతి త్రైమాసికం (మూడు నెలలు) ఫీజును తల్లి ఖాతాలోనే వేస్తాం. ఆ తల్లులే కాలేజీలకు వెళ్లి ఆ ఫీజులు కట్టేలా కార్యక్రమం చేస్తున్నాం.
అడిగే హక్కు ఉంటుంది..
- ఎప్పుడైతే తల్లులు ఫీజులు కట్టడం మొదలు పెడతారో అప్పుడు కాలేజీ యాజమాన్యాలను వారు అడగగలుగుతారు. ఆ కాలేజీలో సదుపాయాలు బాగా లేకపోయినా, టీచింగ్ స్టాఫ్ బాగా లేకపోయినా, ఇంకొకటైనా, ఇంకొకటైనా ఆ తల్లులు ప్రశ్నించే అవకాశం ఉంటుంది.
- తల్లులు ప్రతి మూడు నెలలకు ఒకసారి వారే నేరుగా వెళ్లి ఫీజులు కడితే, మన పిల్లలు ఎలా చదువుతున్నారు? హాజరు ఉందా? కాలేజీకి వెళ్తున్నారా? లేదా? అనే విషయాలు కూడా తెలుసుకోగలుగుతారు. దీని వల్ల ఆత్మగౌరవం పెరుగుతుంది.
- కాలేజీలో సౌకర్యాలు లేవు. ఇంప్రూవ్‌మెంట్ లేదు. ఆ సదుపాయాలు బాగు పర్చాలి అని ఆ తల్లికి అనిపిస్తే అదే 1902 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పండి. ఈ నంబర్ ఎప్పటికీ యాక్టివేషన్‌లోనే ఉంటుంది. ఉన్నత విద్యా శాఖలో ఆ కాల్ సెంటర్ పెట్టాం. దీన్ని సీఎం ఆఫీస్ కూడా పర్యవేక్షిస్తుంది కాబట్టి తల్లులు ఫిర్యాదు చేసిన వెంటనే ప్రభుత్వం యాక్టివేట్ అవుతుంది.
- కాలేజీ యాజమాన్యాలు ఆ పరిస్థితులను ఇంప్రూవ్ చేసే విధంగా కూడా అడుగులు వేస్తాం. అప్పుడు కాలేజీలో పరిస్థితులు, వ్యవస్థ కూడా బాగు పడుతుంది. తల్లులకు జవాబుదారీతనం కూడా వస్తుంది.
ఇక కొత్త ఒరవడి..
- ఒక్క రూపాయి కూడా బకాయి పెట్టకుండా కాలేజీ యాజమాన్యాలకు కట్టాల్సిన ఫీజులన్నీ కట్టేశాం. కాబట్టి ఈ ప్రభుత్వం పిల్లల చదువులకు కట్టుబడి ఉందని, ఫీజుల్లో ఎటువంటి జాప్యం చేయదని కాలేజీ యాజమాన్యాలకు కూడా నమ్మకం కలిగేలా చేస్తున్నాం. ఇది ఒక కొత్త ఒరవడికి నాంది పలుకుతుంది.
- పిల్లల కోసం వసతి దీవెన’ జనవరిలో ప్రారంభించాం. సంవత్సరానికి రెండు దఫాల్లో కలిపి.. జనవరి, ఫిబ్రవరిలో ఒకసారి, మళ్లీ జూలై, ఆగస్టులో రెండో సారి.. పిల్లలకు వసతి, భోజన ఖర్చుల కోసం ప్రతి పిల్లవాడికి రూ.20 వేలు ఇస్తాం. ఇప్పటికే ఒక దఫా రూ.10 వేలు ఇచ్చాం. మళ్లీ జూలై, ఆగస్టులో మిగిలిన రూ.10 వేలు తల్లుల ఖాతాలో డబ్బు జమ చేస్తాం.
కరోనా కష్టాలున్నా మాట నిలుపుకున్నాం..
- వసతి దీవెన, విద్యా దీవెన ఈ రెండు పథకాల వల్ల ప్రతి తల్లి తన పిల్లలను చదివించడం కోసం అప్పులపాలు కాకుండా ఉంటుంది.
- కష్టపడకుండా తన పిల్లలను గొప్పగా చదివించగలుగుతామన్న నమ్మకం, విశ్వాసం వస్తుంది. కరోనా కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
Published date : 29 Apr 2020 04:02PM