పబ్లిక్ సేఫ్టీ క్లబ్‌ల ప్రారంభానికి కాలేజీల ఎంపిక
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత విషయంలో అవగాహన కల్పించేందుకు అన్ని విద్యా సంస్థల్లో పబ్లిక్ సేఫ్టీ క్లబ్‌లు ప్రారంభించాలన్న డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రతిపాదన కార్యరూపం దాలుస్తోంది.
దీని అమలుకు తొలుత హైదరాబాద్‌లోని 5 కళాశాలలను పోలీసు శాఖ ఎంపిక చేసింది. ఈ కార్యక్రమ అమలుకు స్త్రీ, శిశు సంక్షేమ, విద్యా, మున్సిపల్ శాఖలు సహకరిస్తాయి. పబ్లిక్ సేఫ్టీ క్లబ్‌ల అమలుపై శుక్రవారం హైదరాబాద్‌లో విమెన్ సేఫ్టీ వింగ్‌లో ఐజీ స్వాతిలక్రా నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. సేవ్ ద చిల్డ్రన్ ఎన్జీవో సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ విధానాన్ని తొలుత భద్రుకా, అరోరా, జాగృతి, శ్రేయాస్, ఇందిరా ప్రియదర్శిని కళాశాలల్లో అమలు చేయనున్నారు.
Published date : 25 Jan 2020 02:45PM