Skip to main content

ఓయూ పీజీ కోర్సుల ప్రవేశాల ప్రకటన విడుదల

ఉస్మానియా విశ్వవిద్యాలయం (హైదరాబాద్): ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాల్లో 2020-21 విద్యా సంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.
ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసీజే, ఎంఎల్‌ఐసీ, ఎంపీఈడీ, పీజీ డిప్లొమాలు తదితర కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రకటన విడుదలైంది. అక్టోబర్ 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సీపీజీఈటీ-2020 కన్వీనర్ ప్రొ.కిషన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ అర్హత గల విద్యార్థులు నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ సందర్శించాలని సూచించారు.
Published date : 19 Sep 2020 02:26PM

Photo Stories