ఓయూ న్యాయశాస్త్రం సెమిస్టర్ పరీక్షాఫలితాలు విడుదల
Sakshi Education
ఉస్మానియా విశ్వవిద్యాలయం: ఓయూ పరిధిలో సెప్టెంబర్, అక్టోబర్‌లో నిర్వహించిన వివిధ న్యాయశాస్త్రం కోర్సుల (రెగ్యులర్, బ్యాక్‌లాగ్) సెమిస్టర్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి.
మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ ఆరో సెమిస్టర్, మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ ఆనర్స్ ఆరో సెమిస్టర్, బీబీఏ ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పదో సెమిస్టర్, బీకాం ఎల్‌ఎల్బీ ఐదేళ్ల పదో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ప్రకటించినట్లు కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాల కోసం www.osmania.ac.in/ ను సందర్శించాలని సూచించారు.
Published date : 13 Nov 2020 04:11PM