ఒకట్రెండు రోజుల్లో తెలంగాణ అకడమిక్ క్యాలెండర్- 2021 విడుదల!
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఏడాది పాటు చేసే బోధన, అభ్యసన కార్యక్రమాలు, పరీక్షలు తదితరాలకు సంబంధించి విద్యా శాఖ ఏటా వార్షిక విద్యా ప్రణాళిక (అకడమిక్ క్యాలెండర్) విడుదల చేస్తుంది. కేబినెట్ నిర్ణయంతో విద్యా సంవత్సరం పునఃప్రారంభానికి మార్గం సుగమం కావడంతో విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌పై దృష్టి సారించింది. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు అకడమిక్ క్యాలెండర్‌పై సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.
చదవండి: ఈ ఏడాది డిపార్ట్‌మెంట్ వారీగా భర్తీ చేసే పోస్టులు ఇవే.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే..
చదవండి: కర్ణాటక కీలక నిర్ణయం: హిజ్రాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ …
మాకూ టీకాలివ్వండి...
స్కూళ్లు, కాలేజీల ప్రారంభానికి ముందే అధ్యాపకులు, కాలేజీ విద్యార్థులందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు అయినేని సంతోష్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనా రెండో వేవ్‌లో చాలా మంది అధ్యాపకులు ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు.