Skip to main content

ఒకేసారి ఎంబీఏ, పీజీడీఎం కుదరదు: ఏఐసీటీఈ

న్యూఢిల్లీ: ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీల్లో ఒకేసారి ఎంబీఏ, పీజీడీఎం కోర్సులు అందించరాదని, ఆ రెండింటిలో ఏదైనా ఒక కోర్సునే ఎంచుకోవాలని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) పేర్కొంది.
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం) కోర్సును యూనివర్సిటీలు కానీ, యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న విద్యాసంస్థలు కానీ కాకుండా స్వతంత్ర సంస్థలు (ప్రఖ్యాత ఐఐఎంల వంటివి) అందించవచ్చని తెలిపింది. ఒకానొక సమయంలో డీమ్డ్ టు బీ యూనివర్సిటీలు నిబంధనలకు విరుద్ధంగా పీజీడీఎం కోర్సును మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ కింద చేర్చాయని, కానీ ఏఐసీటీ ఈ నిబంధనల ప్రకారం ఒకేసారి ఈ రెండు కోర్సులు అందించడానికి అనుమతులు లేవని ఏఐసీటీఈ అధికారులు తెలిపారు.
Published date : 19 Feb 2020 03:16PM

Photo Stories