నవంబర్ 5 లోపు డిగ్రీ కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల్లో భాగంగా స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ ఈనెల 5వ తేదీలోపు ఇవ్వాలని డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు.
స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌లో 23,971 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, 35,479 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వీరిలో 21,437 మందికి సీట్లను కేటాయించినట్లు, వారంతా 5వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. ఇప్పటివరకు నిర్వహించిన మూడు దశల కౌన్సెలింగ్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన 18,7709 మంది కూడా తమకు సీట్లు లభించిన కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్ట్ చేయాలని తెలిపారు.
Published date : 02 Nov 2020 04:35PM