నవంబర్ 28న వ్యవసాయ వర్సిటీ సర్టిఫికెట్ వెరిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన యూనివర్సిటీల్లో బైపీసీ స్ట్రీమ్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు స్పోర్‌ట్స కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈ నెల 28న ఉంటుందని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్.సుధీర్‌కుమార్ తెలిపారు. స్పోర్‌ట్స కేటగిరీ అభ్యర్థుల వెరిఫికేషన్‌ను స్పోర్‌ట్స అధికారులే నిర్వహిస్తారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అభ్యర్థులు ఠీఠీఠీ.ఞ్జ్టట్చఠ.్ఛఛీఠ.జీ వెబ్ సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
Published date : 25 Nov 2020 03:47PM