Skip to main content

నవంబర్ 24 నుంచి ఏపీ డీసెట్- 2020 కౌన్సెలింగ్

సాక్షి, అమరావతి: డీఎడ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన డీసెట్-2020 కామన్ ఎంట్రెన్స్ టెస్టు కౌన్సెలింగ్ నవంబర్24వ తేదీ నుంచి జరుగనుంది.
ఈ మేరకు డీసెట్ కన్వీనర్ డి.దేవానందరెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డీసెట్-2020 పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు https://cse.ap.gov.in & https://apdeecet.apcfss.in వెబ్‌సైట్లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 30, డిసెంబర్ 1 తేదీల్లో సీట్ల కేటాయింపు, డిసెంబర్ 2 నుంచి అభ్యర్థుల అలాట్‌మెంటు లెటర్లను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని వివరించారు. డిసెంబర్ 3 నుంచి 7 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు.
Published date : 21 Nov 2020 04:38PM

Photo Stories