Skip to main content

నవంబర్ 23 నుంచి ఏపీ అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ

సాక్షి, అమరావతి: నేటి నుంచి పది రోజులపాటు (నవంబరు 23 నుంచి డిసెంబరు 3) అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నామని మహిళా శిశుసంక్షేమాభివృద్దిశాఖ కమిషనర్ కృతికా శుక్లా తెలిపారు.
2019-20, 2020-21 మధ్యలో నియమితులైన 581 మంది కార్యకర్తలకు ఆయా జిల్లాల్లోని మహిళా ప్రాంగణాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా ప్రాజెక్టు అధికారులను ఆదేశించినట్టు ఆదివారం ఒక ప్రకటనలో వివరించారు. ఈ కార్యక్రమాలకు రీజినల్ జాయింట్ డెరైక్టర్లు, జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్లు హాజరై కార్యకర్తలకు వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారని చెప్పారు. ప్రధానంగా మహిళాశిశు సంక్షేమశాఖ లక్ష్యాలు, సేవలు, మహిళలు, పిల్లల్లోని పోషకాహార స్ధితిగతులు, రక్తహీనత, ఆరోగ్యం, పథకాలు సమర్ధంగా అమలుచేసేందుకు ఇతర శాఖలతో సమన్వయం, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణా ప్లస్ పథకాల ప్రాధాన్యం, వృద్దాశ్రమాలు తదితర అంశాలపై కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నామని, మిగిలిన వారికి శిక్షణ ఇచ్చే తేదీలను తరువాత ప్రకటిస్తామని చెప్పారు.
Published date : 23 Nov 2020 02:13PM

Photo Stories