నూతన జాతీయ విద్యా విధానం అమలుకు సహకరించాలి
Sakshi Education
సాక్షి, అమరావతి: నూతన జాతీయ విద్యావిధానం అమలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జాక్టో విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు చైర్మన్ కె.జాలిరెడ్డి (వైఎస్సార్టీఎఫ్), వర్కింగ్ చైర్మన్ సీహెచ్ శ్రావణ్కుమార్ (ఏపీయూఎస్), సెక్రటరీ జనరల్ మల్లు శ్రీధర్రెడ్డి (పీఆర్టీయూ), అంకాల కొండయ్య (ఎస్ఎల్టీఏ), మీడియా కన్వీనర్ సామల సింహాచలం (ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం), కోచైర్మన్లు సీహెచ్ శ్రీనివాసరావు (ఎస్జీటీఎఫ్), ఏపీ రెడ్డి (పీడీఏ), వైఎస్సార్ టీఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.అశోక్కుమార్రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కేంద్ర నూతన విద్యావిధానం మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం అమలుకు అన్ని ఉపాధ్యాయ సంఘాలను పిలిచి ప్రభుత్వం చర్చిస్తోందని, సంఘాల సలహాలు తీసుకుంటున్న దశలో కొన్ని సంఘాలు తల్లిదండ్రులను రెచ్చగొట్టడం, నిరసన కార్యక్రమాలకు పిలుపు నివ్వడం సరికాదన్నారు.
Published date : 30 Jun 2021 04:17PM