నిట్‌తో సీమెన్స్, ఎంటీసీ ఒప్పందం
Sakshi Education
కాజీపేట అర్బన్ : సీమెన్స్ సాఫ్ట్‌వేర్, ఎంట్యాబ్ టెక్నాలజీ సెంటర్లు వరంగల్ అర్బన్ జిల్లాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)తో రూ. 172 కోట్ల విలువైన ఎంఓయూ (మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్) కుదుర్చుకున్నాయి.
కాజీపే టలోని నిట్‌లో ఫిబ్రవరి 13 (గురువారం)ననిట్ డెరైక్టర్ ఎన్వీ.రమణారావు, సీమెన్స్ కంట్రీ సేల్స్ లీడర్ మాథ్యూ థా మస్, ఎంటీసీ డెరైక్టర్ శశి శ్రీమనన్ పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. నిట్ డెరైక్టర్ ఎన్వీ.రమణారావు మాట్లాడుతూ ఎంహెచ్‌ఆర్డీ ద్వా రా ఆమోదం పొందిన టర్కీ ప్రాజెక్టులో భాగంగా సీమెన్స్, ఎంటీసీ కంపెనీలతో ఒప్పందం కదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ ఎంఓయూలో భాగంగా డి జైన్, డిజిటలైజేషన్, ఇండస్ట్రీ-4.0 రంగంలో విద్యార్థులు, అధ్యాపకులకు శిక్షణ ఇవ్వడంతో పాటు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
Published date : 14 Feb 2020 03:58PM