Skip to main content

నెఫ్రోప్లస్‌లో 2 వేల ఉద్యోగ అవకాశాలు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన డయాలసిస్ సెంటర్ నెఫ్రోప్లస్ వచ్చే ఏడాది కొత్తగా 2 వేల మంది క్లినికల్ ఉద్యోగులను నియమించుకోనుంది.
డయాలసిస్ టెక్నీషియన్స్ కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్‌పీడియా ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వటంతో పాటూ ఫ్రాంచైజీల సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్లు నెఫ్రోప్లస్ ఫౌండర్ అండ్ సీఈఓ విక్రమ్ ఉప్పాల ఏప్రిల్ 28న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం నెఫ్రోప్లస్‌కు దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని 120 ప్రాంతాల్లో 203 డయాలసిస్ సెంటర్లున్నాయి. నెలకు 16,500 మందికి పరీక్షలు నిర్వహిస్తోంది.
Published date : 29 Apr 2020 06:17PM

Photo Stories