Skip to main content

నేటి నుంచి రెండో విడత వైద్యుల నియామకాలు

సాక్షి, అమరావతి: తాజాగా జరిగిన వైద్యుల నియామకాల్లో కౌన్సెలింగ్‌కు హాజరు కానివారు, నియామక పత్రాలు తీసుకుని విధుల్లో చేరని వైద్యుల స్థానాల్లో రెండో విడత నియామకాలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
కొద్ది రోజుల కిందటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసేందుకు 665 వైద్యుల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు జరిపారు. వీరిలో 97 మంది నియామకాలు తీసుకున్నా విధుల్లో చేరలేదు. మరో 150 మంది కౌన్సెలింగ్‌లో పాల్గొనలేదు. దీంతో ఈ మొత్తం 247 పోస్టులకు ఈనెల 16న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అదే లిస్టులో తరువాతి ర్యాంకులో ఉన్నవారికి రోస్టర్ పద్ధతిలో, జనరల్ కేటగిరీ ర్యాంకులను చూసి పోస్టింగ్‌లు ఇస్తారు. అభ్యర్థులకు ఈ మెయిల్ ద్వారా సమాచారమిచ్చి వివరాలను కుటుంబ సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
Published date : 15 Sep 2020 12:51PM

Photo Stories