Skip to main content

నేటి నుంచి జేఈఈ పరీక్షలు

సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ అసలు పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
జేఈఈ మెయిన్‌లో భాగంగా మంగళవారం మొదటి రోజు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షకు 80 శాతానికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాలకు, జేఈఈ అడ్వాన్స్ డ్‌కు అర్హులను ఎంపిక చేసే జేఈఈ మెయిన్ అసలు పరీక్షలు బుధవారం నుంచి ఈ నెల 6వ తేదీ వరకు జరగనున్నాయి. రోజుకు రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షలను మొత్తం 10 విడతల్లో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) చర్యలు చేపట్టింది. ఉదయం 9 నుంచి 12 వరకు జరిగే మొదటి విడత పరీక్షకు విద్యార్థులను ఉదయం 7:30 నుంచే అనుమతిస్తామని, గేట్లను 8:30కే మూసివేస్తామని, ఆ తర్వాత వచ్చే వారిని అనుమతించమని స్పష్టం చేసింది.

8,500 మందికి పైగా హాజరు
మొదటి పరీక్షకు రాష్ట్రంలో 8,500 మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారని పరీక్ష నిర్వహణ సంస్థ వెల్లడిం చింది. మొదటి రోజు పరీక్షలో ప్రశ్నలు సులభంగానే వచ్చాయని విద్యార్థులు చెప్పుకొచ్చారు. షిఫ్టుకో ప్రశ్నపత్రం నేపథ్యంలో ప్రశ్నల సరళిని పూర్తి స్థాయిలో అంచనా వేయలేమని అధ్యాపకులు పేర్కొన్నారు.
Published date : 02 Sep 2020 12:33PM

Photo Stories